పేదరికాన్ని పారద్రోలడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం

Mon,April 8, 2019 05:24 PM

సూర్యపేట: పేదరికాన్ని పారద్రోలడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీది ప్రజల ఎజెండా అని ఆయన ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆయన ఈ రోజున సూర్యపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలు గా రాష్ట్రంలో ప్రజల ఎజెండాను అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని ఆయన కొనియాడారు.


ప్రజల ఎజెండాలో భాగంగానే ఉచితంగా రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ నందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 24 గంటల నిరంతర విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా నేనన్నారు . అంతే గాకుండా రైతులకు రుణమాఫీ తో పాటు వ్యవసాయానికి పెట్టుబడి రూపంలో ఎకరాకు 5 వేల రూపాయలు అందిస్తున్న రైతు బంధు పధకం ఇప్పుడు యావత్ భారత దేశానికే దిక్సుచి గా మారిందన్నారు. రైతుభిమా పధకం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనదన్నారు. కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకే ఇప్పటి వరకు భీమా పధకాన్ని వర్తింప చేసేవారన్నారు. అటువంటిది సవరించి సహజ మరణాలకు కూడా బీమా వర్తింప చేసేవిదంగా సవరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. వీటితో పాటే కల్యాణాలక్ష్మీ ,షాది ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలకు జనం నీరాజనాలు పడుతున్నారనడానికి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయాన్నారు.


30 ఏండ్లుగా ఎమ్మెల్యేలుగా మంత్రులు గా పనిచేసి తామే సీనియర్లమని ప్రగలభిస్తున్న జానారెడ్డి , ఉత్తమ్ రెడ్డి , కోమటిరెడ్డిలు రాజకీయంగా ఎదిగినట్లే జిల్లాలో ఫ్లోరిన్ పెరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.ఎక్కడో ఒక కుగ్రామంలో మొదలైన ఫ్లోరిన్ మహామ్మరి జిల్లాను కబలిస్తుంటే ఎందుకు పరిష్కారం కనిపెట్టలేకపోయారో జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి , కోమటిరెడ్డిలు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అటువంటి ఫ్లోరిన్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ దాడి చేసి మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి మంచినీరు అందించే పథకాన్ని ప్రవేశ పెడితే ....ఆ పధకం తో తమ తమ పునాదులే కదులుతాయనుకున్న కాంగ్రెస్ పెద్దలు ఆ పధకాన్ని అడ్డుకోచూసారన్నారు. ఇప్పటి వరకు పాలించిన పాలకులతో వెనుకబాటుకు గురయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 25 వేల మేఘావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిందన్నారు. కేవలం నాలుగున్నర ఏండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మూడు మెడికల్ కళాశాలలను సాదించుకున్నామని ఆయన అన్నారు . ప్రజల ఎజెండా అంటే ఇదని ఇప్పుడు జాతీయ స్థాయి లో లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికలలో ఇటువంటి ఎజెండా ను తెరమీదకు రాకుండా కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. అందులో భాగంగానే బిజెపి కాంగ్రెస్ లు బోఫోర్స్, రాఫెల్ కుంభకోణా లను తెరమీదకు తెచ్చి ప్రజల ఎజెండాను తొక్కిపెడుతున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రజల ఎజెండా చర్చకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అవుతాడన్న భయం కాంగ్రెస్ బీజేపీలను వెంటాడుతోందన్నారు.70 ఏండ్లుగా కాంగ్రెస్,బిజెపి లు దేశ రక్షణ రంగాన్ని తాకట్టు పెట్టాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణం కానివ్వండి మోడీ పాలనలో జరిగిన రాఫెల్ కుంభకోణం కానివ్వండి రెండు కూడా దేశ రక్షణ రంగాన్ని బ్రష్టు పట్టించేవెనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ రంగాన్ని కాంగ్రెస్ , బీజేపీలు ఏ విదంగా బ్రష్టు పట్టించాయన్నది వివరించారు. తిరిగి అవే రెండు పార్టీలు ఈ ఎన్నికలలో ప్రజల ఎజెండా ను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒకరు బోఫోర్స్ అంటే మరొకరు రాఫెల్ అంటూ ప్రజల ఎజెండాను చర్చకు రాకుండా అడ్డుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 30 ఏండ్ల కిందట జరిగిన బోఫోర్స్ కుంభకోణం లో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బిజెపి ఏమి తేల్చిందో చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన అభ్యర్ధించారు.కాంగ్రెస్ , బీజేపీలకు ప్రజల ఎజెండానూ చర్చించే ఓపిక లేదని ఆయన ధ్వజమెత్తారు.దేశాభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలిచిన కాంగ్రెస్ , బీజేపీలను నిలువరించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన వెల్లడించారు. 70 వేల టీఎంసీల నీళ్లు ప్రతిఏటా సముద్రంలో కలుస్తుంటే ఈ రెండు పార్టీలు ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచించిన పాపాన పోయారా లేదా అన్నది విజ్ఞులైన ఓటర్లు ఆలోచన చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.70 వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలుకావడంతో యావత్ భారత దేశంలో 40 వేల ఎకరాల భూమి పడవాపడి ఉందన్నారు .ఆ అంశాన్ని మొట్టమొదటి గా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆయనను బలపరిస్తే దేశము సుసంపన్నం అవుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని,రైతాంగానికి మేలు చెయ్యాలనే రాష్ట్రంలో రైతుబందు, రైతుభిమా ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. అటువంటి నాయకుడి నాయకత్వం కోసం ఇప్పుడు యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న దన్నారు. అభివృద్ధి ని సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు పరుస్తూన్న విషయం యావత్ ప్రజలకు తెలిసిందే నన్నారు. అటువంటి ఫలాలను అనుభవిస్తున్న మనం ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీకే ఎందుకు ఓటువేయ్యాలలో ఆయన వివరించారు.

మిత్రపక్షం మజ్లీస్ తో కలుపుకుని 17 కు17 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని శాశించే స్థాయికి తెలంగాణా చేరుతుందన్నారు పీసీసీ ప్రెసిడెంట్ గా అధికార పార్టీ ఎజెండా పై చర్చించాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన పై పోటీ చేస్తున్న వేమిరెడ్డి నరసింహా రెడ్డి పై దాడికే పరిమితమయ్యారని విమర్శించారు.ఓటమి భయంతోటే ఉత్తమ్ ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కారువయ్యారని అందుకే కిందటి శాసనసభ ఎన్నికల లో ఓటమి పాలయిన వారికి డిపాజిట్లు గల్లంతు ఆయినవారికి టికెట్లు ఇచ్చుకున్నారాన్నారు. నల్గొండలో చెల్లని రూపాయిని భోనగిరిలో కొడంగల్ లో చెల్లని రూపాయిని మల్కాజిగిరి గిరిలో కల్వకుర్తి లో చెల్లని రూపాయి మహబూబ్‌నగర్‌లో పోటీకి దింపారని ఆయన ఎద్దేవా చేశారు.

తనమీద పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటమి తప్పదనే భయంతో అవాకులు చవాకులు పేలుతున్నారని నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి నరసింహా రెడ్డి పేర్కోన్నారు.విజ్ఞులైన న్యాయవాదులే తనపై ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణల పై నిజానిజాలను గమనించాలని అభ్యర్ధించారు. నామినేషన్ పత్రాలను దాఖాలు చేసిన సందర్భంగా తాను ఇచ్చిన అఫిడవిట్ నే ముందరికి తెచ్చి రచ్చ చేస్తున్నారు తప్ప అందులో ఆవగింజంతై నా నిజం లేదని కొట్టి పారేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ కు మూల స్తంభాలైన న్యాయవాదులుఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానన్నారు .

657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles