ఒకేఒక్క ఓటు అభివృద్ధిని నిర్దేశించేది...

Wed,May 8, 2019 03:47 PM

minister jagadish reddy election campaign

సూర్యపేట: ఒకే ఒక్క ఓటు రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తోందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 2014 లో మీరు వేసిన ఓటే ఇప్పుడు మనం అందుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఫలితాల సారాంశం అని ఆయన చెప్పారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి సూర్యపేట మండల పరిధిలోని బాలెంల, లక్ష్మి తండా, ఎర్కారం, టేకుమట్ల గ్రామాలలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయాగ్రామాలలో జరిగిన బహిరంగ సభలలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ ఎన్నికలలో వెయ్యబోయే ఓటే రేపటి అభివృద్ధికి సోపానాలుగా నిలుస్తాయాన్నారు. అటువంటి పరిస్థితిలలో జరుగుతున్న ఎన్నికలలో ప్రతి ఓటరు తమ ఓటును అభివృద్ధిని, సంక్షేమాన్ని సమఫాలల్లో అందించే టీఆర్ఎస్ పార్టీకే వేయాలని అభ్యర్ధించారు.

2014 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్లనే ఇటు సూర్యపేట అటు నల్గొండలలో మెడికల్ కళాశాలాల ఏర్పాటుకు దోహదపడ్డ అంశాన్ని విస్మరించ రాదాన్నారు. అదే ఓటు తో ఆసరా ఫించన్లు సాదించుకున్నామన్న అంశం గుర్తుంచుకోవాలన్నారు. అదే ఓటును తిరిగి మొన్నటి శాసనసభ ఎన్నికలలో టి ఆర్ యస్ కు ఓటు వేసినందుకే జూన్ ఒకటి నుండి వృద్ధులు,వితంతు మహిళలు ,ఒంటరి మహిళలు 2,116,దివ్వాంగులు 3116 అందుకోబోతున్నారని ఆయన చెప్పారు.

కొత్త రాష్ట్రంలో వేసిన మొదటి ఓటు తోటే వచ్చిన కళ్యాణాలక్ష్మి/షాదీముభారక్ లాంటి విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం గుర్తుంచుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి హితబోధ చేశారు.
చరిత్రలోనే ముందెన్నడూ లేని విదంగా రైతుకు పెట్టుబడి అందించే రైతుబందు పధకానికి అంకురార్పణ చుట్టింది కూడా మీరు వేసిన ఓటుతోటేనని ఆయన అన్నారు.

అన్నింటికి మించి యావత్ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా సహజ మరణాలకు కూడా బీమా పధకాన్ని వర్తింపజేయాలని చట్ట సవరణ చేసిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి సంచలనాత్మకమైన పధకాలను ప్రవేశ పెట్టడం అంటేనే మీరు వేసిన ఓటు తోటేనని చేప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కదాన్నారు.

మీరు ఓటును బ్యాలెట్ కంటే కూడా బులెట్ లాగా వాడుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించినందుకే కాబోలు యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణా రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ ను సాదించుకున్నామన్నారు. రేపటి ప్రాదేశిక ఎన్నికలలోను
మీరు వెయ్యబోయే ఓటే రేపటి పల్లెల్లో అభివృద్ధి కి సోపానాలుగా మారబోతోన్న్నాయాన్నారు.
2014,2018 ఎన్నికలలో ఓటు ద్వారా ఇచ్చిన విలక్షణమైన తీర్పే రేపటి ప్రాదేశిక ఎన్నికలలోను ప్రతిబింబించాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

1295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles