ఊరికి నాలుగు ఘోరీలు తప్ప చేసిందేమీ లేదు: జగదీశ్ రెడ్డి

Wed,December 5, 2018 10:16 AM

minister jagadish reddy do election campaign in Suryapet

సూర్యాపేట: జిల్లాలోని పెన్ పహాడ్ మండలం దుబ్బతండాలో సూర్యాపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. నా మీద పోటీ చేస్తున్న ఇద్దరిని తుంగతుర్తి ప్రజలు తరిమికొట్టారు. వారి పాలనా హయంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఊరికి నాలుగు ఘోరీలు ఇచ్చారు తప్పా, చేసింది ఏమి లేదన్నారు. 2014 ఎన్నికలకు ముందు సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి ఇచ్చిన హామీలన్ని నెరవేర్చా. సూర్యాపేటను జిల్లాగా చేస్థానని చెప్పి చేసిన. పేట ప్రజలకు మూసి మురికి నీటి నిండి విముక్తి కల్పించి కృష్ణా జలాలను తీసుకువచ్చిన. సూర్యాపేటలో రౌడీ రాజ్యంను ఆంతమొందించి, సిండికేట్ లను అంతం చేస్తానని చెప్పిన. 70 శాతం తండాల్లో సీసీ రోడ్లు పూర్తి చేసినాము. తండాలను పంచాయితీలుగా చేస్తామని చెప్పి పంచాయితీలుగా చేసిoది టీఆర్ఎస్ ప్రభుత్వం. 60 ఏళ్ల గత పాలకుల హయాంలో తెలంగాణా రాష్ట్రం, సూర్యాపేట నియోజకవర్గం సర్వనాశనం అయ్యాయి. 2014కు ముందు తెలంగాణాలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవి. వాటిని కొంతలో కొంత అయిన ఆపడానికి 200 ఉన్న పెన్స్షన్ ను 1000 రూపాయలు చేసినాము. 500 రూపాయలు ఉన్న పెన్స్షన్ ను 1500 రూపాయలు చేసినము. నాణ్యమైన కరెంట్ తో రైతులను కాపాడటం కోసం అధికారంలోకి వచ్చిన సంవత్సరoలోపు 7 గంటలు, రెండవ ఏడాది 9 గంటలు, ప్రస్తుతం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇలా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశoలొనే తెలంగాణ రాష్ట్రo. కూతుర్ల పెళ్ళిలకు ఇబ్బంది పడుతున్న గిరిజన సోదరుల కష్టాల నుండి పుట్టిందే కల్యాణ లక్ష్మీ.

మేము దేశాన్ని పాలించిన నేతలమని ఫోజులు కొడుతున్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మోడీ, పక్కన ఉన్న చంద్రబాబు సొంత రాష్టాల్లో కూడా 24 గంటల కరెంట్, కల్యాణ లక్ష్మి వంటి పధకాలు లేవు. నేటికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వేలాది గ్రామాల్లో కరెంట్ సౌకర్యం లేదు. గత పలుకుల హయాంలో విత్తనాలు, ఎరువుల దుకాణాల వద్ద లాఠీ ఛార్జ్ లు ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విత్తనాలు, ఎరువుల కొరత లేదు. రైతు సంక్షేమం కోసమే రైతు బందు, రైతు బీమా వంటి పధకాలు. గత పాలకుల హయంలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణంలో జరిగిన అవినీతి వల్లే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పదకం ఆలస్యం అయింది. మళ్ళీ టీఆర్ఎస్ ను గేలిపిస్తే సొంత జాగా ఉన్న ప్రతీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు. ప్రస్తుతం ఇస్తున్న పెన్స్షన్ లను రెట్టింపు చేయడంతో పాటు వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గిస్తాం. నిరుద్యోగ యువకులకు రూ. 3016 నిరుద్యోగ భృతి. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీతో పాటు రైతు బంధు పదకం సహాయం ఎకరాకు రూ. 10 వేలకు పెంచుతాం.

టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. ఇతర పార్టీలకు ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఎడారి అవుతుంది. ప్రజల సంక్షేమం కోసం కాకుండా, ఓట్ల కోసమే గత పాలకులు ఎస్సారెస్పీ కాలువలను తవ్వించి. ప్రజలను 30 ఏళ్ళ నుండి ఓట్ల కోసం మోసం చేసిర్రు. కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా, వచ్చే ఏడాది నుండి 8 నెలల పాటు సూర్యాపేట నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు. భూ ప్రక్షాళనలో నూతన పాస్ బుక్ లు రాకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు గెలిచిన పది రోజుల్లో దగ్గరుండి పాస్ బుక్ లు ఇప్పిస్తా. మరోసారి గెలిపిస్తే, తనకు ఓటు వేసిన ప్రతీ ఒక్కరు గర్వపడేలా సూర్యాపేట నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు.

1496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles