ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

Thu,September 20, 2018 01:09 PM

minister jagadeeshwar reddy visit pranai family members

నల్లగొండ: ఇటీవల దారుణ హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య, మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, గాదరి కిశోర్‌లు పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రణయ్‌ను హత్య చేసిన నిందితులను సాంఘీక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున 8 లక్షల 25వేల రూపాయలు, డబుల్ బెడ్‌రూం ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించడం జరిగిందన్నారు. గంటల వ్యవధిలోనే పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించి హంతకులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు సహించదని తెలిపారు.

1089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles