ఉగాది పచ్చడి తయారు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

Sat,April 6, 2019 04:02 PM

minister jagadeesh reddy participated in ugadi celebrations

సూర్యాపేటలోని మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, నల్గొండ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఉగాది పచ్చడిని స్వయంగా తయారు చేసి అతిథులకు పంచారు. హోంమంత్రి అలీకి మంత్రి జగదీశ్ రెడ్డి ఉగాది పచ్చడిని అందించారు. వేమిరెడ్డి నరసింహారెడ్డి.. హోంమంత్రికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

తీపి చేదుల కలయిక మానవ జీవితాలను ప్రతిబింబిస్తోంది. ఉగాది పచ్చడి తరహాలోనే హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉండాలి. కష్ట సుఖాలు కలిసిపోయినట్లుగా తీపి చేదులను కలుపుతూ నవ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు సమపాళ్లలో అందిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. నాలుగున్నరేళ్లుగా మొదలు పెట్టిన అభివృద్ధి ఫలాలు ఈ నవవసంతంలో ప్రజలకు చేరుతాయన్నారు.

1154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles