కార్యకర్తలే నా బలం: జగదీశ్‌ రెడ్డి

Wed,July 18, 2018 06:23 PM

నల్గొండ: ఇవాళ మంత్రి జగదీశ్‌ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కార్యకర్తలే తన బలమని.. వాళ్ల దీవెనలతోనే ముందుకు పోతున్నానని స్పష్టం చేశారు. జిల్లాలో నాలుగు సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని విధంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే అన్నది సీఎం కేసీఆర్‌ పాలసీ అని.. ఆ తర్వాత అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


గత పాలనలో ప్రజలు విసిగిపోయారన్న మంత్రి.. టీఆర్‌ఎస్‌ పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజాప్రతినిధులు కూడా చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు 20 సార్లు జిల్లాలో పర్యటించారని.. కేసీఆర్‌కు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. జిల్లాకు మూడు మెడికల్‌ కాలేజీలు రావడం నిజంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన వరాలని స్పష్టం చేశారు. సమైక్య పాలకుల పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకుల అణచివేతే లక్ష్యంగా పాలన ఉండేదన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో మాత్రం అందరి సంక్షేమం కోసం పాటు పడుతున్నామని.. అందరి అభివృద్ధిని కాంక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈసందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి అభిమానం చాటుకున్న ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

1856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles