కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేయొద్దు

Sun,May 5, 2019 10:08 PM

minister jagadeesh reddy fires on congress party

-కాంగ్రెస్, టీడీపీల హయాంలో పల్లెలు శ్మశానవాటికలయ్యాయి..
-టీఆర్‌ఎస్ పాలనలో నేడు నందనవనాలుగా మారుతున్నాయి...
-విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సూర్యాపేట: కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజలు తప్పు చేయవద్దని, తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తుంగతుర్తి నియోజక వర్గాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీదేనని, అటువంటి పార్టీలను ఆదరిస్తే ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మరోసారి రక్త ప్రవాహం పారిస్తారని విమర్శించారు.

కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఘర్షణలతో శ్మశానాలుగా మారిన పల్లెలు ఇప్పడిప్పుడే శాంతియుతంగా మారుతున్నాయని, అటువంటి పల్లెల్లో మళ్లీ కుంపటి రాజేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఇది ప్రజలు గమనించాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నాలుగున్నరేళ్లలో విపక్షాలపై చిన్న కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగురవేస్తే మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూరనర్సయ్యగౌడ్, జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

2447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles