బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

Sun,September 9, 2018 01:04 PM

Minister Indrakaran reddy visits Basara Temple

నిర్మల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంప‌తులు, ముధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పండితులు, సిబ్బంది వీరికి స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి, ఛైర్మన్ శరత్ పాఠక్ కండువాలతో సన్మానించారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సంజీవ్, వేద పండితులు నవీన్‌శర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు లింగంపల్లి లక్ష్మీ నారాయణ, మల్లన్న యాదవ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కమీషనర్ కమ్ డైరెక్టర్ ఆఫ్‌ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టీకే శ్రీదేవి సరస్వతీ దేవి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. వీరికి ఆల‌య పండితులు పూర్ణ కుంభ‌ముతో స్వాగ‌తం ప‌లికారు. అర్చ‌న చేసిన త‌రువాత ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు సంజీవ్ పూజారి అమ్మ‌వారి ప్ర‌సాదం అంద‌జేశారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles