Telangana Intermediate 1st & 2nd Year Results 2019

బాసర ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు: ఇంద్రకరణ్ రెడ్డి

Thu,February 28, 2019 11:45 AM

minister indrakaran reddy visit to Basara Temple

బాస‌ర‌ : నిర్మల్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా రెండోసారి ప‌ద‌వీ భాద్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత తొలిసారి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..రూ.50 కోట్ల‌తో బాస‌ర క్షేత్రాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. మాస్ట‌ర్ ప్లాన్ పూర్తైన వెంటేనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు టెండ‌ర్ల‌ను పిలిచి ప‌నులు మొద‌లుపెడ్తామ‌ని చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో ముథోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఆయ‌ల ఈవో సుధాక‌ర్ రెడ్డి, త‌దిత‌రులు ఉన్నారు.

887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles