తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Thu,June 13, 2019 10:24 AM

minister indrakaran reddy visit tirumala

తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... భద్రాచలంను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే ప్రతిపాదన లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నిరుపయోగంగా ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌లను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారని తెలిపారు.

384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles