కార్మికుల త‌ర‌పున సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి ఐకేరెడ్డి

Thu,September 19, 2019 02:30 PM

హైద‌రాబాద్ : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా, దీపావ‌ళి పండుగను పుర‌స్క‌రించుకుని బోన‌స్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సింగేరేణి కార్మికుల త‌ర‌పున మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రతి కార్మికునికి రూ. 1,00,899 బోనస్ ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని సీఎం చాటుకున్నారన్నారు. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా బోనస్ పెంచారని కొనియాడారు.


సింగరేణి కార్మికులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తూ వారి సమస్యల పట్ల అనునిత్యం స్పందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతం అయిందని పేర్కొన్నారు.

706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles