చ‌రిత్ర‌లో నిలిచేలా ప్ర‌గ‌తి నివేద‌న‌ స‌భ‌: మంత్రి అల్లోల

Sat,September 1, 2018 05:21 PM

minister indrakaran reddy start pragathi Nivedhana Sabha rally from nirmal

నిర్మ‌ల్ : సెప్టెంబర్ 2న నిర్వహించనున్న ప్రగతి నివేదన సభను చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సభను నిర్వహిస్తామని, ఇప్పటికే సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ప్రగతి నివేదన సభకు తరలి వెళ్లుతున్న ర్యాలీని జెండా ఊపి లాంచ‌నంగా ప్రారంభించారు. అంత‌కుముందు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా వాహన సదుపాయాలు, జనసమీకరణపై టీఆర్ఎస్ నేత‌ల‌తో చర్చించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ....ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ల‌క్ష మంది త‌ర‌లివెళ్లేలా ఏర్పాట్లు చేస్త్తున్నామ‌న్నారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో నాలుగేళ్ల అభివృద్దిని స‌గ‌ర్వంగా వివ‌రిస్తామ‌ని తెలిపారు. సీయం కేసీఆర్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని వెల్ల‌డించారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. టీఆర్ఎస్ సిద్దంగా ఉంద‌న్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నిక‌లు కొత్త కాద‌ని, కానీ ఎన్నిక‌లంటే కాంగ్రెస్,టీడిపీలు భ‌య‌ప‌డుతున్నాయ‌న్నారు.

ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన కేసీఆర్, అధికారంలోకి రావడమే కాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో మనకు గౌరవం దక్కిందన్నారు. అప్పటి నుంచే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని పేర్కొన్నారు.

బిందెడు నీటి కోసం ఎదురు చూసిన పల్లెలు, నేడు కాళేశ్వరం, గోదావరి జలాలతో పులకించి పోతున్నాయని చెప్పారు. భూప్రక్షాళన, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కంటి వెలుగుతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి లెక్కలేనన్ని పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంద‌ని కొనియాడారు. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు వెళ్లే ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హాక‌రిస్తూ, వారు సూచించే స‌ల‌హాల‌ను,సూచ‌న‌లను పాటిస్తూ, సుర‌క్షితంగా వెళ్లాల‌ని ఈ సంద‌ర్బంగా కోరారు.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles