ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది...

Sun,July 7, 2019 04:09 PM

minister indrakaran reddy start membership drive in nirmal

హైదరాబాద్: ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలోని పలు వార్డ్ లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... రెండేళ్లకు ఒకసారి నిర్వహించే పార్టీ సభ్యత్వాన్ని ముమ్మరం చేయాలని కార్యకర్తలకు సుచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి లక్ష్యం మేరకు సభ్యత్వం పూర్తి చేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 10లోగా సభ్యత్వం పూర్తి చేయాలని తెలిపారు.

1576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles