గ‌డ‌ప గ‌డ‌పకూ సంక్షేమ ప‌థ‌కాలు: మంత్రి ఐకేరెడ్డి

Fri,November 9, 2018 01:35 PM

minister Indrakaran reddy election campaign in nirmal

నిర్మ‌ల్ : ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు గ‌డ‌ప గ‌డ‌పకూ చేర‌డంతో ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. ప‌ట్ట‌ణ, గ్రామాలు, ప‌ల్లెలు, గిరిజ‌న తండా వాసులు తెరాస‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌బ్బండ వ‌ర్ణాల ప్ర‌జ‌లంతా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెన్నంటే న‌డుస్తున్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణం ఖురాన్ పేట్,చిక్క‌ట్ ప‌ల్లి,మొఘ‌ల్ పురాలో మంత్రి అల్లోల విస్తృత ప్ర‌చారం చేశారు.

కాల‌నీ వాసులు ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇంటింటికి తిరుగుతూ ....ఇప్ప‌టికే నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశాన‌ని, మ‌రోసారి ప‌ట్టం క‌డితే ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతాన‌ని ఓట‌ర్ల‌కు వివ‌రించారు. నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా ప‌ని చేస్తాన‌ని,త‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని మంత్రి అల్లోల అభ్య‌ర్థించారు. మేనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ..కేసీఆర్ సారథ్యంలోనే బంగారు, హ‌రిత తెలంగాణగా పుదిద్దుకుంటుంద‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల సంక్షేమ కోసం నిరంత‌రం పాటుప‌డే మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని అన్నారు. నిర్మ‌ల్ జిల్లా ఏర్పాటుతో ప‌ట్టణ, నియోజ‌క‌వ‌ర్గ రూపురేఖ‌లు పూర్తిగా మార‌నున్నాయ‌ని వెల్ల‌డించారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్న‌డూ లేని విధంగా అభివృద్ది ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. అభివృద్దిని చూసి మ‌రోసారి ఆశీర్వదించాల‌ని కోరారు. మ‌హ‌కూట‌మి నేత‌లు అభివృద్ది నిరోధ‌కుల‌ని, వారి మాట‌లు న‌మ్మొద్ద‌ని స్ప‌ష్టం చేశారు. స‌మ‌క్య పాల‌న‌లో తెలంగాణ పూర్తిగా ఏడారిగా మారింద‌ని గుర్తు చేశారు.

బీడు భూముల‌ను స‌స్య‌శామలం చేసేందుకు సీయం కేసీఆర్ భారీ ప్రాజెక్ట్ ల క‌డుతుంటే.... తెలంగాణ నీళ్ల‌ను ఆంధ్రాకు త‌ర‌లించేందుకు కుట్ర‌లు పన్నుతున్న చంద్ర‌బాబు నాయుడితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న‌ ప‌న్నాగాల‌ను తిప్పికొట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని, వారికి ఓటుతోనే ప్ర‌జ‌లు బుద్ది చెప్పాల‌న్నారు.

621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles