వలసలు, ఆకలి లేని పల్లెలే కేసీఆర్ నినాదం: మంత్రి హరీశ్

Sun,December 17, 2017 06:59 PM

minister harishrao visits jangaon district and laid foundation stone for lake feeder channel works

జనగామ: వలసలు, ఆకలి లేని పల్లెలే కేసీఆర్ నినాదమని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని లింగాలఘనపురం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. దొడ్డి కొమురయ్య తెలంగాణకే ఆదర్శమని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు గొర్ల కురుమలకు చంద్రగ్రహణం పట్టిందన్న హరీశ్ రావు.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కురుమలంతా బంగారు బాటలో నడుస్తున్నారన్నారు.

జిల్లాలో గొర్ల కురుమలకు మొత్తం లక్ష గొర్రెలను ఇచ్చామని మంత్రి తెలియజేశారు. దేశం మొత్తానికి మాంసం అందించే దిశగా గొర్రెల కురుమలు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మిషన్ భగీరథలో జనగాం జిల్లా ముందుందని... త్వరలోనే ఇంటింటికి మంచి నీరు అందిస్తామని మంత్రి ఈసందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి విప్ బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.

నాగుల చెరువు మరమ్మతు పనులకు శంకుస్థాపన
అంతకుముందు స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. కోమటి గూడెం శివారు నాగుల చెరువు ఫీడర్ చానెల్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 4.50 కోట్ల బడ్జెట్‌ను ఈ మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది.

క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీశ్

లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రి వెంట ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, ఎర్రబెల్లి ఉన్నారు.

2268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles