సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి హరీష్‌రావు..

Sat,December 7, 2019 09:40 PM

గజ్వేల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ నెల 11న గజ్వేల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం పర్యటన సందర్భంగా తీసుకునే ఏర్పాట్లపై ఆర్థికమంత్రి హరీష్‌రావు సమీక్షించారు. గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, మహతి ఆడిటోరియం హాల్‌ను మంత్రి సాయంత్రం జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, తదితర విషయాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావుతో పాటు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌, జేసీ పద్మాకర్‌, డీఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.

813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles