‘సంఘటితం చేయడమే సమన్వయ సమితిల ప్రధాన లక్ష్యం’Wed,September 13, 2017 07:09 PM
‘సంఘటితం చేయడమే సమన్వయ సమితిల ప్రధాన లక్ష్యం’

సిద్దిపేట: రాష్ట్రంలో రైతులను సంఘటితం చేయడమే సమన్వయ సమితుల ప్రధాన లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నేడు రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 81 ఏళ్ల కింద నిజాం హయాంలో భూ సర్వే జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు భూసర్వే గురించి పట్టించుకోలేదన్నారు. ఎవరు రైతు, ఎవరి చేతిలో భూమి ఉన్నదన్న విషయం తేలాలన్నారు. తాము పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి రైతులు ఎదగాలని చెప్పారు. రైతుల పంటను సమన్వయ సమితిల ఆధ్వర్యంలో ప్రభుత్వమే కొంటదని తెలిపారు. రైతులు ఎంత పంట పండించినా మద్దతు ధర ఇచ్చి కొంటామన్నారు.

కాంగ్రెస్ పాలన అంటేనే ఎరువుల కొరత, విత్తనాల కొరతన్నారు. కాంగ్రెస్ హయాంలో 6 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. కాగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ప్రతి మూడు ఊర్లకు ఒక వ్యవసాయ అధికారిని నియమించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం నీటితో చెరువులు నింపితే వాన కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నరన్నారు. కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నరని మంత్రి దుయ్యబట్టారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. రైతుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. సమన్వయ సమితుల ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

493
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS