పలు ప్రాజెక్టుల నిర్మాణాలపై మంత్రి హరీష్ సమీక్ష

Wed,November 1, 2017 09:59 PM

హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని చెన్నూరు, ఉప్పగల్లు, పాలకుర్తి రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మూడు రిజర్వాయర్ల పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, కాంట్రాక్టర్లు సరిగా పనిచేయడం లేదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పడంతో...పాలకుర్తి రిజర్వాయర్ పనులను వెంటనే వేరే కాంట్రాక్టర్ కు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి హరీష్ నీటి పారుదలశాఖ ఈ ఎండ్ సీ మురళీధర్ రావు, సీఈ బంగారయ్యలను ఆదేశించారు. అదేవిధంగా చెన్నూరు, ఉప్పగల్లు పనుల తీరును కూడా నెల రోజుల పాటు పరిశీలించి అక్కడి కాంట్రాక్టర్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆలేరు నియోజక వర్గాల్లోని నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సమావేశ మందిరంలో సమీక్ష చేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆలేరు ఎమ్మెల్యే సునీతారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.


దేవాదుల మూడో దశ పనులు వేగవంతం చేయాలని, లింగంపల్లి-మల్కాపూర్ రిజర్వాయర్ కోసం సిఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా.. పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. దేవాదుల మూడో దశ పనులు ఎంత స్పీడప్ చేస్తే అంత వాటర్ ను రైతులకు ఇవ్వవచ్చన్నారు. దేవాదుల ఇన్టేక్ బ్యారేజ్, మూడో దశ పనుల వేగవంతం, లింగంపల్లి- మల్కాపూర్ రిజర్వాయర్ పనులు జరిగితేనే రైతులకు న్యాయం జరుగుతుందని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ఈ మూడు పనులు ఒకేసారి జరిగితేనే అనుకున్నలోపు లక్ష్యాలు సాధిస్తామన్నారు.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles