ప్రజలను ఓట్లడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉంది: హరీశ్‌రావు

Fri,October 19, 2018 05:35 PM

minister harish rao visits mulugu mandal in siddipet district

సిద్దిపేట: జిల్లాలోని ములుగు మండలంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. ములుగు మండలంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ములుగు మండలంలో కొండపోచమ్మ జలాశయం, విత్తన పార్క్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న మంత్రి.. ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. రాష్ట్రంలో వందకుపైగా సీట్లను గెలుపొంది అధికారం చేపడతామని... మహాకూటమిని మట్టిలో కలిపేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles