టీఆర్‌ఎస్‌తోనే సంక్షేమం..కూటమితో సంక్షోభం: హరీశ్‌రావు

Mon,November 26, 2018 10:18 PM

చెన్నారావుపేట : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షేమం ఉంటుందని, లేకుంటే కూటమితో సంక్షోభం ఏర్పడుతుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి అమీనాబాద్, చెన్నారావుపేటలో చేపట్టిన రోడ్‌షో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని, అలాంటి ద్రోహితో కాంగ్రెస్ నాయకులు పొత్తులు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు.


చంద్రబాబు ఇచ్చే పైసల పెట్టెల కోసం మహాకూటమిగా ఏర్పడి పొత్తులు పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతున్నాడని, ఎవరూ అడ్డుపడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు ఆగవని, ఇప్పటికే 90శాతం పనులు పూర్తయ్యాయని రెండు, మూడు నెలల్లో పనులను త్వరిత గతిన పూర్తి చేసి రైతుల రెండు పంటలకు సాగునీరందించి పంటలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

అంతేకాక రూ.1000కోట్లతో ఎస్సారెస్పీ కాలువల ఆధునీకీకరణ పనులు చేపట్టి నర్సంపేట నియోజకవర్గంలో 186చెరువులను సాగునీటితో నింపామన్నారు. అదేవిధంగా 12చెక్‌డ్యాంల నిర్మాణ పనులనకు 63కోట్ల రూపాయలను మంజూరు చేశామని, ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో రానున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ అజీరా సీతారాంనాయక్, నర్సంపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

1039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles