జమ్మిచెట్టుకు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజ

Sat,September 30, 2017 01:45 PM

సిద్ధిపేట : రాష్ట్రంలో దసరా పండుగ ఘనంగా జరుగుతుంది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి.. కోటి ఎకరాలకు నీరందిస్తామని మంత్రి ఉద్ఘాటించారు. మతసామరస్యానికి సిద్ధిపేట ప్రతీక అని హరీష్‌రావు పేర్కొన్నారు. హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఉన్నారు.

1126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles