బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలి : మంత్రి హరీష్‌రావు

Fri,September 20, 2019 07:07 PM

పనాజీ : బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు కోరారు. గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్రానికి మంత్రి హరీష్‌రావు పలు విజ్ఞప్తులు చేశారు. తెలంగాణలో బీడీ తయారీ యూనిట్లు వెయ్యి ఉన్నాయని తెలిపారు. బీడీ తయారీ రంగంలో 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. 28 శాతం జీఎస్టీ వల్ల బీడీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. అధిక మొత్తంలో పన్నుల వల్ల పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉందని హరీష్‌రావు పేర్కొన్నారు.

463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles