పత్తి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయండి: హరీశ్ రావు

Wed,August 29, 2018 05:39 PM

minister harish rao meeting with agriculture and marketing department

హైదరాబాద్: రాబోవు పత్తి మార్కెటింగ్ సీజన్ కోసం ముందస్తు ప్రణాళికను ప్రభుత్వము సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2018-19 ఖరీఫ్ మార్కెటింగ్ సీజనుకు పత్తికి క్వింటాలుకు మద్దతు ధర రూ.5,450 గా ప్రకటించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఐటీసీ కాకతీయ గ్రాండ్ లో జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సీసీఐ ఛైర్మన్ అల్లిరాణి, సీసీఐ సంచాలకులు చొక్కాలింగం, మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి పాల్గొన్నారు.

గత ఏడాది మాదిరిగానే జిల్లా కలెక్టర్లు ప్రకటించిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఇందుకు సీసీఐ ఛైర్మన్ అల్లిరాణి అంగీకరించారు. గత ఏడాది మాదిరిగానే ప్రత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్ యార్డులను కొనుగోలు కేంద్రలుగా వినియోగించనున్నారు. ఈ కొనుగోలు కేంద్రాలన్ని అక్టోబర్ 1వ తేదీ నాటికి సిద్ధంగా ఉంచాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పత్తి నుంచి దూది శాతం ఈ సంవత్సరం 33 గా నిర్ణయించడం వల్ల రాష్ట్రంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులు సీసీఐ పిలిచిన లీజు టెండర్లలో ఇప్పటివరకు పాల్గొనకపోవడంపై ఈ సమీక్షలో ప్రధాన చర్చ జరిగింది.

ఈ సమీక్షలో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దీనిపై సీసీఐ ఛైర్మన్ స్పందిస్తూ మంత్రి హరీష్ రావు లేఖ మేరకు జిన్నింగ్ మిల్లులు ఇవ్వాల్సిన దూది శాతాన్ని 33 నుంచి 31.5 గా తగ్గిస్తూ టెండర్లను తిరిగి పిలవడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ.5,450 గా నిర్ణయించినందున రైతులు ఎక్కువ శాతం సీసీఐకు అమ్మడానికి ఇష్టపడతారని మంత్రి చెప్పారు. సీసీఐ లీజు విషయంలో జిన్నింగ్ మిల్లుల ప్రతిష్టంభన రైతు ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉంటుందని, కావున జిన్నింగ్ మిల్లుల అభ్యర్థనను మరింత లోతుగా పరిశీలించాలని కోరారు. అందుకు సీసీఐ ఛైర్మన్ అంగీకరిస్తూ వెంటనే జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ముంబయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ తరపున ఎంఎస్పీ ఆపరేషన్ కు అవసరమైన సాఫ్ట్ వేర్ పరికరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని రైతుల గుర్తింపు, పంట అమ్మిన వెంటనే రైతులకు చెల్లింపుల విషయమై తగు చర్యలు తీసుకోవల్సిందిగా మార్కెటింగ్ శాఖ సంచాలకులను ఆదేశించారు. ఈ సమావేశంలో పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

1848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles