బొమ్మకూరు రిజర్వాయర్‌ను ప్రారంభించిన హరీశ్ రావు

Sat,March 10, 2018 09:28 PM

minister harish rao launches bommakuru reservoir in jangaon district

జనగామ: మంత్రి హరీశ్‌రావు ఇవాళ జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బొమ్మకూరు రిజర్వాయర్ ఫేజ్ 3 పంపుహౌజ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 3 ప్యాకేజీ 4లో భాగంగా బొమ్మకూర్ పంప్‌హౌజ్ నిర్మాణాన్ని చేపట్టారు. పంప్‌హౌజ్ ద్వారా నర్మెట్ట మండలం కన్నెబోయినగూడెం, లద్నూర్ మండలాలకు మంత్రి నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. బొమ్మకూరు దేవాదుల ఫేస్ 3 ద్వారా సాగునీటిని విడుదల చేయడంతో ప్రజలు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వాలు 100 -110 రోజులు మాత్రమే నీరందించేవన్న హరీశ్ రావు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చిలో కూడా సాగునీటిని తెస్తున్నదన్నారు. గత ప్రభుత్వాలు 38 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే 60 టీఎంసీలు కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. కరువు కాటకాలతో అల్లాడిన జనగామ ప్రాంతం నేడు పచ్చటి పొలాలతో కళకళలాడుతున్నదని మంత్రి వ్యాఖ్యానించారు.

2186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles