సీఎం కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్ రావు

Mon,November 19, 2018 03:18 PM

Minister Harish Rao Inspects cm kcr public meeting in siddipet

సిద్ధిపేట: జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు పక్కన ఉన్న మైదానంలో రేపు జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్థానిక నాయకులకు సూచించారు. సభా ప్రాంగణం, వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలను మంత్రి పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హరీశ్ రావు వెంట పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.


833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles