టెంపుల్ సిటీగా కొమురవెళ్లి మల్లన్న ఆలయం: హరీశ్ రావు

Fri,November 22, 2019 08:46 PM

సిద్ధిపేట జిల్లా శ్రీ కొమురవెళ్లి మల్లన్న దేవాలయంలో రాజగోపుర కుంభాభిశేక పూజా కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం కొమురవెళ్లి మల్లన్న గుట్టపై రూ.53లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయ మహా మండపం నిర్మాణ పనులకు శంకుస్థాపన. కింద అతిథి గృహానికి శంకుస్థాపన చేసి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నిర్మాణాలపై అధికారులతో అక్కడికక్కడే సమీక్షించారు. రూ.30లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తు భవన నిర్మాణంలో 6 గదుల ధర్మశాలను ప్రారంభించారు. అనంతరం రూ.58లక్షలతో నిర్మించిన డార్మిటరీ హాల్-అన్నదాన సత్రం ప్రారంభించారు. అభివృద్ధి నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దు.. తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా జన్మ ధన్యమైంది. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. రాజగోపుర మహా కుంభాభిషేక పుష్కరోత్సవమంటే 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మహాత్కార్యం. గత 12 ఏళ్ల క్రితం జరిగిన కార్యక్రమంలో మేము పాల్గొనే అదృష్టం లేకున్నా ఈ యేడు మల్లన్న స్వామి అనుగ్రహం ఆశీస్సులతో ఆ భాగ్యం మాకు కలిగింది. కొమురవెళ్లి అన్నీ క్షేత్రాల కంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. భక్తులు కొంగు బంగారంగా కొలిచే కొమురెళ్లి కోర మీసం. మల్లన్న సన్నిధిలో నిరంతరం భక్తుల తాకిడితో విరాజిల్లుతున్న గొప్ప మహిమాన్వితమైన దివ్య క్షేత్రం ఇది.

సీఎం కేసీఆర్ గారు గొప్ప భక్తి పరుడు. అందుకే ఆలయాలకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. జిల్లాకు తూర్పున కొమురవెళ్లి మల్లన్న, కోండిపోచమ్మ దేవాలయాలు, పశ్చిమాన నాచారం శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి, ఉత్తరాన బెజ్జంకి శ్రీ లక్ష్మీ నర్సన్న.. ఇలా ఎన్నో పురాతనమైన ఆలయాలకు నెలవుగా ఉంది. శ్రీ కొమురవెళ్లి మల్లన్న పేరుతోనే మల్లన్న సాగర్, కొండ పోచమ్మ అమ్మవారి పేరుతో కొండ పోచమ్మ సాగర్ దేవాలయ ఖిల్లా.. రిజర్వాయర్ల జిల్లాగా పేరు గాంచింది. కొమురవెళ్లి మల్లన్న ఆలయం టెంపుల్ సిటీగా చేసుకుందాం. వచ్చే జాతరకు వెండి తాపడంతో కూడిన ద్వారాలను ప్రారంభించుకుందాంమని తెలిపారు.

1509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles