కూటమికి ఓటేస్తే తెలంగాణ ఆగమవుతది

Sat,November 10, 2018 02:14 PM

Minister Harish Rao fire on Mahakutami

రంగారెడ్డి : మహా కూటమికి ఓటేస్తే తెలంగాణ ఆగమవుతది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ సంక్షోభం ఏర్పడుతది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రైతు సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఆపాలని 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ రాసిండు. మహబూబ్‌నగర్‌కు నీళ్లు ఇవ్వొద్దంటున్న చంద్రబాబుకు ఓట్లు ఎట్లా వేస్తారు? తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటామని ఏపీ టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. 2013లోనే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి జీవో ఇచ్చారు. తాము గెలిస్తే పాలమూరు ఎత్తిపోతలను కడుతామని చంద్రబాబును పక్కన కూర్చోబెట్టుకొని మోదీ 2014లో ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు 2007లోనే డీపీఆర్ తయారైంది. 11 ఏళ్ల క్రితమే జీవో జారీ అయింది. గతంలో అపెక్స్ కమిటీ ముందు తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడిండు.

రాచకొండ లిఫ్ట్ ద్వారా ఇబ్రహీంపట్నంకు నీళ్లొస్తాయి. సీఎం కేసీఆర్ వెంట నడుస్తేనే రాచకొండ ఎత్తిపోతల పూర్తవుతది. వెయ్యి మంది చంద్రబాబులు అడ్డు వచ్చినా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేస్తాం. పాలమూరు, డిండి ఎత్తిపోతల కట్టాలా? వద్దా? అనే విషయాన్ని చంద్రబాబు చేత కాంగ్రెస్ చెప్పించాలి. చంద్రబాబుతో క్షమాపణ చెప్పించిన తర్వాతనే కూటమి ఓట్లు అడగాలి. డిండి ప్రాజెక్టుకు అడ్డం పడనని చంద్రబాబు జానారెడ్డికి ఏమైనా రాసి ఇచ్చిండా?

వ్యవసాయానికి 24 గంటల కరెంట్, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 8 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది. డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో తెలుగుదేశం ఉండదు. తెలంగాణ ద్రోహితో జతకట్టిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. ఉద్యమించే వాడినే తెలంగాణ కోరుకుంటుంది. గులాంగిరి చేసేవారికి తెలంగాణ సమాజం ఎన్నడూ అండగా ఉండదు. సంక్షేమం కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయండి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

1459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles