రాజకీయ దురుద్దేశంతోనే కోదండరాం యాత్ర

Sat,June 24, 2017 01:02 PM

Minister Harish rao fire on Kodandaram

సిద్ధిపేట : రాజకీయ దురుద్దేశంతోనే కోదండరాం యాత్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు. తడ్కపల్లిలో హరితహారంలో భాగంగా హరీష్‌రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపించి కోదండరాంతో యాత్ర చేయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల ప్రయోజనాల కోసం కోదండరాం పని చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటూ మరోవైపు నీళ్లెందుకు రాలేదంటూ ప్రశ్నించడం సరికాదన్నారు. కోదండరాంకు ప్రజలపై ప్రేమ ఉంటే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు.

కోదండరాం ఇలాగే వ్యవహరిస్తే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి విశ్వాసం కూడా పోతుందని చెప్పారు. 60 ఏళ్లలో సాధించని అభివృద్ధిని మూడేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం సాధించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు సింగూరు జలాలను మెదక్ రైతులకు ఇవ్వలేకపోయాయని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం గతేడాది 40 వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. 2018 నాటికి సిద్ధిపేట ప్రాంతంలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కోదండరాంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలను మానుకోవాలని కోదండరాంకు మంత్రి హరీష్‌రావు సూచించారు.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles