చంద్రబాబు కుట్రదారు : హరీష్ రావు

Mon,December 3, 2018 12:44 PM

Minister Harish Rao fire on Chandrababu politics in telangana

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టీఆర్ నాయకుడు హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు కుట్రలపై హరీష్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డుపడకుండా ఉంటే 18 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేది. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అని నాడు కాకినాడలో 1998లోనే బీజేపీ తీర్మానం చేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ చిన్న రాష్ర్టాలకు కట్టుబడి 2000లో ఛత్తీస్ ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ర్టాలను ఏర్పాటు చేసింది. తెలంగాణను ఏర్పాటు చేద్దామనుకున్న బీజేపీకి చంద్రబాబు అడ్డుపడ్డాడు.

ఎందుకంటే నాడు బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి తెలంగాణకు అడ్డుపడ్డాడు. తెలంగాణ ఇవ్వొద్దని చంద్రబాబు కోరడం వల్లే తెలంగాణ ఇవ్వలేకపోయామని విజయవాడలో 2009 ఫిబ్రవరి 5న ఎల్ కే అద్వానీ చెప్పాడు. ఆ తర్వాత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. టీడీపీ కారణంగానే తెలంగాణ ఇవ్వలేదు అని 2008లో చెప్పారు. ఆ తర్వాత అనేక సార్లు తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నారు. 2012లో తెలంగాణ మీ కోసం యాత్ర నిర్వహిస్తూ కూడా తెలంగాణపై ద్వేషం చిందించారు. చంద్రబాబు అడ్డుకోకుండా ఉంటే తెలంగాణ 18 ఏళ్ల క్రితమే వచ్చేది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ రైతులు కరెంట్ అడిగితే రైతులను కాల్చి చంపించిన చరిత్ర చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పదాన్ని చంద్రబాబు అసెంబ్లీలో నిషేధించిన విషయం అందరికీ తెలుసు. తెలంగాణ ఇవ్వొద్దని ప్రణబ్ కమిటీకి చంద్రబాబు లేఖలు రాశారు. ఈ విధంగా అడుగడుగునా తెలంగాణకు చంద్రబాబు అడ్డుపడ్డారని హరీష్ రావుపై మండిపడ్డారు.

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles