అభివృద్ధికి, అవకాశవాదానికి జరుగుతున్న ఎన్నికలు...

Fri,November 9, 2018 01:30 PM

minister harish rao election campaign in gajwel

గజ్వెల్ : అభివృద్ధికి అవకాశవాదానికి జరుగుతున్న ఎన్నికలు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వెల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు విడి విడిగా మోసం చేసిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కలసి మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నాయి. తుప్రాన్ అభివృద్ది కేసీఆర్ తోనే సాధ్యం అయింది. గతంలో తాగు నీటిని అందించలేదు. కానీ ఇప్పుడు స్వచ్చమైన తాగునీరు అందిస్తున్నాం. రిజినల్ రింగు రోడ్డు ద్వారా ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. గజ్వేల్ లో ఇప్పటివరకు 13 మంది ఎమ్మెల్యేలు 1000 కొట్లు తెస్తే కేసీఆర్ హయంలో ఇప్పటి వరకు జరిగిన అబివృద్ధి 6000 కోట్లు అని వివరించారు. గజ్వేల్ అభివృద్దికి మారుపేరుగా మారింది.

కంటి వెలుగుల కేసీఆర్ ఒకవైపు - రెండుకండ్ల సిద్దాంతం , కన్నుకొట్టె రాహుల్ మరోవైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇవ్వడం కూడా చాతకావడం లేదని ఎద్దేవా చేశారు. మీ సొంత స్థలంలోనే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాం. తూప్రాన్ , మనోహరాబాద్ లకు కాళేశ్వరం నీళ్లిస్తాం. తూప్రాన్ లో మార్కెట్ యార్డు నిర్మించింది కేసీఆర్ అని తెలిపారు. గెలుపు విషయంలో అనుమానం లేదు. సర్వెలో టీఆర్ఎస్ కు 75శాతం ప్రజలు మద్దతిస్తున్నారు. అన్ని పార్టీలకు పావలా శాతం కూడా ఓట్లు లేవు. ఈ నెల 11వతేది ఉదయం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌజ్ లో కార్యకర్తల సమావేశం ఉంటుందని తెలిపారు.

1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles