రైతు బంధు:హ‌రీశ్ రావుపై కురిసిన గులాబీ పూల వర్షం

Wed,May 16, 2018 11:05 AM

Minister Harish Rao Distributes Rythu Bandhu Cheques To Farmers

సిద్ధిపేట: జిల్లాలోని గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌కు గ్రామ ప్రజలు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బయ్యారం స్టేజి నుంచి బూరగుపల్లి వరకు 3 కిలోమీటర్ల మేర బైక్‌పై భారీ ర్యాలీ నిర్వహించారు. బూరుగుపల్లిలో మంత్రి రాకను పురస్కరించుకొని వాడవాడలా గులాబీ పూల వర్షం కురిసింది. బతుకమ్మ, బోనాలు, పోతరాజు వేషాలు, వినూత్న రీతిలో కోలాటాలు, కళాకారుల నృత్య ప్రదర్శన చేస్తూ మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రైతులకు మంత్రి హరీశ్ రావు రైతు బంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నం. రైతుల పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నాం. బూరుగుపల్లికి గోదావరి నీళ్లను తీసుకొస్తున్నాం. మండలానికి ఒక గోదామును నిర్మించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్డు కార్పొరేషన్ ఛైర్మన్ నర్సారెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ భూంరెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్‌రెడ్డి, గడ ప్రత్యేకాధికారి హనుమంతరావు పాల్గొన్నారు.

సిద్ధిపేట అర్బన్ మండలం రంగదాంపల్లిలో రైతు బంధు కార్యక్రమంలో కూడా హరీశ్ రావు పాల్గొన్నారు. రైతు బంధు పథకం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. రైతుల కోసం ఇంత గొప్ప పథకాన్ని ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. పంట పెట్టుబడిని వ్యవసాయ అవసరాలకే ఉపయోగించాలని రైతులను కోరారు.

3070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles