ఘనంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

Sun,June 3, 2018 01:26 PM

minister harish rao birth day celebrations at Minister quarters

హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు 45వ జన్మదినోత్సవ వేడుకలు బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఘనంగా జరిగాయి. తన 45వ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు తన తల్లి లక్ష్మీ ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి బర్త్ డే వేడుకల్లో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉదయం నుంచి మంత్రుల నివాస సముదాయం జన సందోహంగా మారింది. మంత్రి హరీష్ రావుకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. కేకులు, పూల బోకేలతో మంత్రిని కలిసి‌ శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు స్కూల్ పిల్లలు సైతం మంత్రి హరీష్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు‌ ప్రతీ ఒక్కరిని ఓపికతో మంత్రి హరీష్ రావు వారిని కలిసి వార నుంచి అభినందనలు స్వీకరించారు. తనతో సెల్ఫీలు అడిగిన వారందరితో సెల్ఫీలు దిగారు.

మంత్రి హరీష్ రావును ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణా రెడ్డి, అరికెలపూడి గాంధీ, మాధవరం కృష్ణా రావు, చింతా ప్రభాకర్, బాబుమోహన్ ,భూపాల్‌రెడ్డి లు మంత్రి హరీష్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

టపాసులు కాల్చి కార్యకర్తలు సంబరాలు‌ చేశారు. కళాకారుల కళారూపాలతో మంత్రి నివాసం పండుగ వాతావరణం కనిపించింది. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు,‌టీచర్లు బృందాలు గా వచ్చి మంత్రి హరీష్ రావును కలిసి ‌శుభాకాంక్షలు‌ తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరిని కలిసి‌వారి అభినందనలను అందుకున్నారు.

ఇదే క్రమంలో ఓ దివ్యాంగురాలు మంత్రిని కలిసేందు వచ్చి, జన సందోహం కారణంగా కలవలేకపోయింది. అదే సమయంలో దుబ్బాకలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కారెక్కిన మంత్రి హరీష్ రావుకు ఈ విషయం తెలియడంతో కారు దిగి వచ్చి ఆమెను పలుకరించారు.‌ఆ దివ్యాంగురాలు‌తన సమస్య విన్నవించడంతో తప్పక సాయం‌చేస్తానని హమీ ఇచ్చారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తమను మంత్రి పలుకరించి, ఆప్యాయంగా మాట్లాడిన తీరు పట్ల‌ వారు ఆనందభరితులయ్యారు.

3633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles