అక్రమాలకు తావులేకుండా ధాన్యం కొనుగోళ్లు

Mon,December 2, 2019 05:57 PM

కరీంనగర్: అక్రమాలకు తావులేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లో సివిల్ సైప్లె, విజిలెన్స్ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు.'సెంట్ భూమిలేనివారు కూడా కౌలు రైతుల పేరుతో అక్రమంగా ధాన్యం అమ్ముతున్నారు. అక్రమాల నివారణకు పౌరసరఫరాల శాఖ ద్వారా సాఫ్ట్‌వేర్ రూపొందించాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పాలి. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని' మంత్రి హెచ్చరించారు.

407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles