కొండగట్టు బస్సు ప్రమాదం దురదృష్టకరం: ఈటల

Tue,September 11, 2018 04:38 PM

minister etela rajender visits bus accident victims jagtial govt hospital

కరీంనగర్: కొండగట్టు బస్సు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి ఈటల అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి ఈటల హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. చనిపోయిన వారంతా నిరుపేదలు కావడం బాధాకరమన్నారు. చనిపోయిన వారిలో రైతులు ఉంటే నష్టపరిహారంతో పాటు రైతు బీమా వర్తింపజేస్తామని మంత్రి అన్నారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్నవారికి రూ.2 లక్షలు అదనంగా ఇస్తామన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రతినిధులందరూ కలిసి మృతుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షలు సహాయం అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బస్సుకు ఫిట్‌నెస్ ఉంది.. డ్రైవర్‌కు అనుభవమూ ఉందన్న మంత్రి.. గాయపడ్డ వారందరికీ పూర్తిస్థాయిలో చికిత్స ప్రభుత్వమే అందిస్తుందన్నారు. బస్సులో 86 మంది ప్రయాణికులు ఉన్నారన్న మంత్రి.. అదుపు తప్పిన బస్సు 25 అడుగుల లోతులో పడిపోయిందన్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 54కు చేరింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

1567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles