అభివృద్ధి చేసినోళ్లకే ఓటు అడిగే అర్హత: మంత్రి ఈటల

Mon,October 15, 2018 10:20 PM

minister etela rajender campaign in huzurabad

హుజూరాబాద్: అభివృద్ధి చేసినోళ్లకే ఓటు అడిగే అర్హత ఉందని, గతంలో పాలించిన పార్టీల నాయకులు ఓట్లు ఎలా అడుగుతారని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్, రాంపూర్, జూపాక, బొత్తలపల్లి, సింగాపూర్, మాందాడిపల్లి, బోర్నపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలతో సమావేశమై మాట్లాడారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, తదితర పథకాలు ఎవరూ అడుగకముందే పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకువచ్చామని చెప్పారు. సొంత జాగల్లో కూడా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడానికి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని సూచన ప్రాయంగా పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఇస్తామంటే ఆంధ్రా తొత్తు నాయకులు ఎద్దేవా చేశారనీ, మరిప్పుడు వాళ్లు ప్రజలకు ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. ప్రజల కష్టసుఃఖాలు తెలిసిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేననీ, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు.. మానకొండూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండలం చెర్లపల్లి(ఎన్)లో టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు.

624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles