రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మార్గమధ్యంలో ఆగి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఈటల

Fri,July 12, 2019 08:33 PM

minister etela condolences to victims of man who died in accident in karimnagar

కరీంనగర్: జిల్లాలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయ గుట్ట సమీపంలో కరీంనగర్-వరంగల్ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన గూడూరి భూంరెడ్డి (35) బైక్‌పై భార్య శిరీష, కొడుకు హరిధర్‌రెడ్డితో బంధువుల ఇంటికి వెళ్తుండగా ఇసుక ట్రాక్టర్ వాళ్ల బైక్ ను ఢీకొట్టడంతో భూంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదం తర్వాత హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న మంత్రి ఈటల రాజేందర్ అక్కడ జనం గుమిగూడి ఉండడం చూసి తన వాహనాన్ని ఆపి కిందకు దిగారు. ప్రమాదం జరిగిన తీరుపై ఎస్‌ఐ సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అని వాకబు చేశారు. మృతుడి భార్య శిరీష, కుటుంబ సభ్యులు మంత్రి కాళ్లపై పడి రోదించగా వారిని ఓదార్చారు. కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మృతుడి బంధువుల ద్వారా వ్యవసాయ భూమి ఉందని తెలుసుకుని రైతుబందు పథకం వర్తించేలా చర్యలు చేపట్టాలని పక్కనే ఉన్న కొత్తగట్టు సర్పంచ్ మొకిరాల కిషన్‌రావుకు సూచించారు.

2698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles