ఉపాధి కూలీలతో మంత్రి ఎర్రబెల్లి ముచ్చట్లు

Wed,March 20, 2019 04:53 PM

minister errabelli talks with mahatma gandhi employment scheme labours in kodakandla

జనగామ: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ జిల్లాలోని కొడకండ్ల మండలంలో ఆకస్మిక పర్యటన చేశారు. మంత్రి తొర్రూర్ మండలంలో పర్యటించి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఉపాధి కూలీలను కలిశారు. వారితో మంత్రి కాసేపు ముచ్చటించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం అమలు తీరును కూలీలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి. ఏం పనులు చేస్తున్నారు. ఎంత కూలీ వస్తుంది అంటూ మంత్రి సరదాగా వారితో ముచ్చటించారు. వేసవి కాలం దృష్ట్యా.. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కూలీలకు సూచించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

1410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles