బ్రాహ్మణులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Fri,June 7, 2019 10:20 PM

minister errabelli participates in upanayana mahotsavam

వరంగల్: బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయత్‌ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వరద దత్తక్షేత్రంలో యజ్ఞోపవీతమ్ ఆధ్వర్యాన 51 మంది వటువులకు ఉచిత సామూహిక ఉపనయన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్‌రావు, అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు గణేష్ పాల్గొన్నారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం పలు పథకాలను రూపొందించి, కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. యజ్ఞోపవీతమ్ సంస్థ ఇలాంటి భక్తిభావమైన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందించడానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. బ్రాహ్మణుల ఆశీస్సులు సదా ఉండాలని ఆయన కోరారు.

1039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles