శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

Sun,April 14, 2019 02:58 PM

minister errabelli participated in seetharamula kalyanam in palakurthy

జనగామ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీసీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. శ్రీరామనవమి వేడుకల్లో మంత్రితో పాటు ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి సీతారామచంద్ర స్వామి వారికి పట్టువస్ర్తాలను బహుకరించారు.మరోవైపు జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండలో శ్రీసీతారామచంద్ర స్వామి వారి కల్యాణంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు.

1123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles