కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా..

Mon,June 24, 2019 10:03 PM

minister errabelli laid foundation stone to jangaon trs party office

- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-టీఆర్‌ఎస్ జనగామ జిల్లా కార్యాలయానికి భూమిపూజ, శంకుస్థాపన

జనగామ: టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేసే ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, రానున్న ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసిన వారికి పెద్దపీట వేయాలన్నది పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇవాళ జనగామ జిల్లా కేంద్రం శివారు యశ్వంతపూర్ వద్ద టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

ఒగ్గుడోలు కళాకారులు, మహిళల బోనాలు, బతుకమ్మలతో అంగరంగ వైభవంగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ సేవెల్లి సంపత్, జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్లు ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టినా కార్యకర్తలు ఏం ఆశించకుండా పార్టీ కోసం కష్టపడ్డారన్నారన్నారు. ఉద్యమంలో పనిచేసిన కొందరికి పదవులు వచ్చినా, ఇంకా చాలా మందికి అవకాశాలు రాకున్నా అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయాన్ని ఇచ్చారన్నారు. ప్రపంచ దేశాలు అబ్బురపడి తెలంగాణ వైపు చూసేలా అద్భుత పథకాలతో కేసీఆర్.. ప్రతీ కార్యకర్త టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకునేలా చేశారన్నారు.

ముఖ్యమంత్రిని ఒప్పించి జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు ఏడాదికి రెండు పంటలు పండేలా గోదావరి జలాలు అందించే వరకు నిద్రపోనని మంత్రి దయాకర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మంచినీళ్లు తాగించాలన్న పట్టుదలతో రూ.45వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలు బిగించి నీళ్లు ఇస్తున్న మహాత్ముడు కేసీఆర్ అని అన్నారు.

వేసవిలో ఒక్క గొంతుక ఎండకుండా బృహత్తరమైన పథకం అమలు చేస్తే కాంగ్రెస్ నాయకులు 20 లీటర్ల క్యాన్‌కు రూ.20 రూపాయలు ఖర్చుచేయడం అవసరమా? అంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అనుభవించి స్వలాభం కోసం పనిచేసిన వారు ఏనాడైనా చెరువులకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చేశారా? సుదీర్ఘకాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంటింటికీ ఎందుకు మంచి నీళ్లు ఇవ్వలేదో ప్రజల్లో చర్చ పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కృష్ణా, గోదావరిలో నీళ్లు లేకున్నా మంచినీళ్లు తాగిస్తున్న మహానుభావుడు కేసీఆర్.. భగీరథ శాఖను తనకు అప్పగించడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచం అబ్బురపడేలా నిర్మాణం జరుగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా అందించే నీటికి ఎకరానికి రూ.50వేల ఖర్చు అవసరమా? అంటూ టీవీ చర్చా గోష్టిల్లో కాంగ్రెస్ నాయకుల వాదన విడ్డూరంగా ఉందని, తెలంగాణ రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వడం కాంగ్రెస్‌కు బాధగా ఉందని ఎద్దేవా చేశారు. ఎంత ఖర్చయినా తెలంగాణలోని ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వడం ధ్యేయంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందన్నారు.

316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles