టీఆర్ఎస్ కార్యకర్త మృతితో కన్నీరు పెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Sat,June 8, 2019 06:36 PM

minister errabelli expressed his grief over trs activist death in warangal rural dist

విజయ్ మృతికి మంత్రి నివాళి
వరంగల్ రూరల్: టీఆర్ఎస్ కార్యకర్త మృతితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చలించిపోయాడు. పదేళ్లపాటు తనకు చేదోడువాదోడుగా ఉన్న కార్యకర్త ప్రమాదానికి గురయి మరణించడంతో ఆ బాధను ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీటి పర్యంతం కావడంతో ఆసుపత్రి ఆవరణలోని ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

రాయపర్తి మండల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు భూక్యా క్రాంతి భర్త విజయ్‌కుమార్ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాయపర్తి మండలంలోని ఫన్యానాయక్‌తండాకు చెందిన భూక్యా విజయ్‌కుమార్ ఇవాళ తెల్లవారుజామున విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహించే విజయ్‌కుమార్ తన ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే వైర్‌కు తగలడంతో ప్రమాదానికి గురై మృతి చెందాడు.

మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం రాయపర్తి పోలీసులు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి దయాకర్‌రావు నేరుగా హన్మకొండ నుంచి వర్ధన్నపేట పీహెచ్‌సీకి వచ్చారు. విజయ్ మృతదేహాన్ని చూసి దయాకర్‌రావు చలించిపోయి బోరున ఏడ్చారు. మంత్రి రోదించడంతో ఆయన పక్కన ఉన్న పార్టీ నాయకులు, విజయ్ బంధువులు కూడా విలపించారు. అలాగే దయాకర్‌రావు సతీమణి ఉషాదయాకర్‌రావు కూడా వర్దన్నపేట పీహెచ్‌సీకి వచ్చి విజయ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం ఫన్యానాయక్ తండాలో జరిగిన విజయ్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు.

6240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles