చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ అభివృద్ధి

Wed,May 8, 2019 11:37 AM

Minister Errabelli Dayakar Rao Speech At  warangal

వరంగల్: తెలంగాణ సమగ్రాభివృద్ధి టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున రాయపర్తి, మైలారం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గుండెల్లో టీఆర్‌ఎస్ నిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బేజారైంది. చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎస్సారెస్పీకి జలకళ వచ్చింది.

గ్రామాల్లో సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ తాపత్రయం. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సంకల్పం. కాళేశ్వరం తెలంగాణ రాష్ర్టానికి మణిహారం కాబోతోంది. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ర్టానికి దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరోసారి కారు గుర్తుకే ఓటేసి..కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని మంత్రి పిలుపునిచ్చారు.

1550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles