సీఎం కేసీఆర్ బహిరంగ సభా స్థలం పరిశీలన..

Sun,March 24, 2019 06:35 PM

minister errabelli dayakar rao inspected cm kcr meeting places in mahabubabad

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 4న సీఎం కేసీఆర్ నిర్వహించే భారీ బహిరంగ సభా స్థలాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవిత పరిశీలించారు.

శనిగపురం రోడ్డులో గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సభ నిర్వహించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఇల్లందు రోడ్డులోని గాంధీపురం వద్ద మరో సభా స్థలిని పరిశీలించారు. అదే విధంగా నర్సంపేట రోడ్డులోని మున్నేరు వాగు సమీపంలో మరో సభా స్థలిని పరిశీలించారు. ఈ మూడు సభా స్థలాల్లో ఏదో ఒకటి ఖరారు చేసేందుకు నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం మహబూబాబాద్ కేంద్రంలోని నందనా గార్డెన్‌లో నిర్వహించిన మహబూబాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 16 స్థానాలు గెలిప్తే కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పనున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఎప్పుడో ఖాయమైందని మెజార్టీపైనే కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించాలని కోరారు. 80 శాతం మెజార్టీ ఇచ్చిన గ్రామాలను దత్తత తీసుకోనున్నట్లు మంత్రి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ బాలాజీనాయక్, టీఆర్‌ఎస్ పట్టణ, రూరల్ అధ్యక్షులు మార్నేని వెంకన్న, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నెహ్రురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1398
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles