కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు నూకలు చెల్లాయి..

Sun,May 12, 2019 10:03 PM

minister errabelli dayakar rao election campaign in mulugu

- ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పేది సీఎం కేసీఆరే
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు

ములుగు: కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు నూకలు చెల్లాయని, ఆ పార్టీలు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించలేక చతికిల పడిపోయాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు గోవిందరావుపేట మండలంలో ఏర్పాటు చేసిన ప్రాదేశిక ఎన్నికల మూడో దశ ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యమ్నాయ ప్రభుత్వ ఏర్పాటులో రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించబోతున్నారని అన్నారు.

దేశంలో సీఎం నేతృత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వాన్ని జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా వర్తింపజేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయ పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీల కోసమే కొట్లాడుతున్నాయని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.

2015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles