దేశంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పనైపోయింది...

Sun,March 24, 2019 03:52 PM

minister errabelli dayakar rao election campaign at mahabubabad

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ పార్టీల పనైపోయిందని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌ను బలపర్చాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు ఎక్కడా కూడా లేవు. రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు పథకాలు ఇతర రాష్ర్టాల్లో కూడా అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు. 50వేలకు పైగా మెజార్టీ సాధించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలి. ఏ పార్టీ వ్యక్తి అయినా టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేసే రోజులు వచ్చాయి. ఏప్రిల్ 4వ తేదీన సీఎం కేసీఆర్ మహబూబాబాద్ వస్తున్నారని తెలిపారు.

806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles