ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

Tue,November 12, 2019 05:58 PM

వరంగల్ రూరల్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో కలెక్టర్ హరితతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి రైతూ తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించిందనీ.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయవద్దనీ.. తెలిసి తెలసి వారి చేతిలో మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి రైతులకు సూచించారు.

545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles