శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రి ఈటల

Wed,May 17, 2017 06:25 AM

హైదరాబాద్: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను విధానంపై ఈ నెల 18, 19న జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. జూలై నుంచి అమలులోకి రాబోతున్న జీఎస్టీ ఏకీకృత పన్ను విధానంలో ఏ వస్తువును ఏ స్లాబ్‌రేట్ పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై శ్రీనగర్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. వ్యవసాయ ఉత్పత్తులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఈటల ఈ సమావేశంలో కోరనున్నట్టు సమాచారం.

763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles