మాయకూటమికి ఓటు వేస్తే మురిగినట్టే..

Thu,November 15, 2018 08:13 PM

minister chandulal participated in election campaign in jayashankar bhupalpally dist

మంత్రి చందూలాల్
ఐదు వందల మంది టీఆర్‌ఎస్‌లోకి చేరిక

జయశంకర్ భూపాలపల్లి: మాయాకూటమికి ఓటేస్తే మురిగిపోయినట్టేనని ములుగు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. మంగపేట మండలంలోని కమలాపురంలో ఇవాళ‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

టీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటెయ్యాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కమలాపురంలో వివిధ‌ పార్టీలకు చెందిన 500 మంది టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరగా, వారికి చందూలాల్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోదావరి రోడ్డు వీధిలో జంపాల కరుణాకర్, ఎల్లంకి రాజేశ్, పురుషోత్తం ఆధ్వర్యంలో 150 మంది, ఇందిరానగర్‌లో బీజేపీ నాయకుడు తుక్కాని శ్రీనివాస్‌తో పాటుగా, యూత్ నాయకులు ప్రతాప్, గేదెల రామరాజు, చోట్టిపల్లి వెంకటేశ్, కొమురం రమేశ్, దుర్గం బాలక్రిష్ణతో పాటుగా 200 మంది, పాతూరులోని పచ్చా శేషగిరిరావు, అన్నపురెడ్డి రాణాప్రతాప్‌రెడ్డి, శిద్దంశెట్టి లక్ష్మణ్‌రావు సమక్షంలో ఎస్సీ కాలనీకి చెందిన 150 మంది టీఆర్‌ఎస్‌లోకి చేరారు.

1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles