
జయశంకర్ భూపాలపల్లి: ములుగు టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చందూలాల్‌కు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చందూలాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని పేర్కొన్నారు. మహాకూటమి ద్రోహుల కూటమి అని అభివర్ణించారు. విపక్షాల మాటలను ప్రజలు విశ్వసించరని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని, టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.