Telangana Intermediate 1st & 2nd Year Results 2019

14న ఆదిలాబాద్‌లో జరిగే కేటీఆర్ స‌న్నాహక సభకు భారీగా త‌ర‌లిరావాలి..

Sun,March 10, 2019 06:46 PM

minister allola indrakaran reddy participated in adilabad constituency meeting

నిర్మ‌ల్: తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక‌రామారావు అద్య‌క్ష‌త‌న జ‌రిగే స‌న్నాహక స‌మావేశానికి ఆదిలాబాద్ పార్ల‌మెంట్ స్థానం ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లిరావాల‌ని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖానాపూర్, నిర్మ‌ల్, ముధోల్ నియోజ‌క‌వ‌ర్గాల ముఖ్య కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ... ఆదిలాబాద్ పార్ల‌మెంట‌రీ స‌న్నాహక స‌మావేశ స‌భ‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించేలా ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ శ్రేణుల‌కు దిశానిర్ధేశం చేస్తార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపున‌కు ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త కృషి చేయాల‌న్నారు.

కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ.. ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసే స్థితిలో లేవ‌ని, తెలంగాణ‌లో ఉన్న 17 పార్ల‌మెంట్ స్థానాల్లో మిత్ర‌ప‌క్షం ఎంఐఎంకు ఒక్క సీటుతో స‌హా 16 స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించుకుంటే కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంద‌న్నారు. త‌ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌తో పాటు ప్ర‌త్యేక నిధులు తీసుకు రావటానికి అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ న‌గేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయ‌క్, ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిది డా.వేణుగోపాలచారి, నిర్మ‌ల్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ డి.విఠ‌ల్ రావు, టీఆర్ఎస్ ముఖ్య నాయ‌కులు స‌త్య‌నారాయ‌ణ గౌడ్, శ్రీహ‌రి రావు, డా.మ‌ల్లికార్జున రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

1153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles